Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్‌కు షాక్‌.. విజయనగర ఎమ్మెల్యే ఆనంద్‌ సింగ్‌ రాజీనామా

  • జిందాల్‌ కంపెనీ వ్యవహారంలో కుమార్‌స్వామి ప్రభుత్వంపై అసంతృప్తి
  • ఆనంద్‌ బాటలో మరో ఏడుగురు ఎమ్మెల్యేలు?
  • సంకీర్ణ సర్కారు మనుగడపై అనుమానాలు
కర్ణాటకలోని విజయనగర కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌ పార్టీ అధిష్ఠానానికి షాకిచ్చారు. జిందాల్‌ కంపెనీ భూముల విక్రయాలపై కుమారస్వామి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఈయన బాటలోనే నడిచేందుకు మరో ఏడుగురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే రాష్ట్రంలోని కాంగ్రెస్‌, జేడీ (ఎస్‌) సర్కారు మనుగడ మళ్లీ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఆరంభం నుంచి పడుతూ లేస్తూ ‘దినదిన గండం...’ అన్నచందంగా ఉన్న కుమారస్వామి ప్రభుత్వం ఈరోజు గడిస్తే చాలన్నంత భారంగా నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆనంద్‌సింగ్‌ రాజీనామా, ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఇది ఎక్కడికి దారితీస్తుందో అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
Karnataka
vijayanagar MLA
anand singh regains

More Telugu News