Lift: లిఫ్ట్ ఇస్తానని చెప్పి యువతిని ఎక్కించుకుని దోపిడీ!

  • వరంగల్ జిల్లాలో ఘటన
  • జనగామ వెళ్లేందుకు వేచి చూస్తున్న యువతి
  • డంపింగ్ యార్డ్ వద్దకు తీసుకెళ్లి దోపిడీ
ఏదో పనిమీద బయలుదేరిన ఓ యువతి, రోడ్డుపై బస్ కోసం వేచి చూస్తుంటే, తాను ఆ దారిలోనే వెళుతున్నానని, తీసుకెళ్తానని నమ్మబలికిన ఓ వ్యక్తి, దారి మధ్యలో దోపిడీకి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా చంపక్‌ హిల్స్‌ డంపింగ్‌ యార్డు వద్ద జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల మేరకు, ఓబుల్‌ కేశ్వాపూర్‌, పెద్దపహాడ్‌ చౌరస్తా వద్ద జనగామకు వెళ్లే బస్ కోసం యువతి వెయిట్ చేస్తోంది.

ఇంతలో అటుగానే వెళుతున్న ఓ ద్విచక్రవాహనదారుడు ఆమెను తీసుకెళ్తానని చెప్పాడు. లిఫ్టు ఇస్తాడన్న నమ్మకంతో ఆమె బైక్‌ ఎక్కింది. దారి మధ్యలో ఆపడంతో, ఆమెకు అనుమానం వచ్చి కేకలు వేయగా, ఆమె నోటిని నొక్కి పట్టుకుని, అరిస్తే చంపేస్తానని బెదిరించి, ఆమె వద్ద ఉన్న డబ్బు, సెల్ ఫోన్ లను దొంగిలించి పారిపోయాడు. ఆపై ఆమె నేరుగా పోలీసు స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయగా, వాహనదారుడు ఎవరన్న విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు వేట ప్రారంభించారు.
Lift
Warangal Urban District
Janagom
Bus

More Telugu News