Andhra Pradesh: ఏపీలో మహిళా పోలీసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు!: హోంమంత్రి సుచరిత

  • పోలీసులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
  • డాక్టర్లకు రక్షణ కల్పించే బాధ్యత పోలీసులపైనే ఉంది
  • గుంటూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న హోంమంత్రి
నిరంతరం విధుల్లో ఉండే పోలీసులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత సూచించారు. పోలీసులకు ఆరోగ్య భద్రత కల్పించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డాక్టర్లపై దాడులు చోటుచేసుకుంటున్నాయనీ, వైద్యులకు రక్షణ కల్పించే బాధ్యత పోలీసులపై ఉందని అభిప్రాయపడ్డారు. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా గుంటూరులో ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో ఏపీ హోంమంత్రి పాల్గొన్నారు.

గుంటూరు పోలీస్ పరేడ్ మైదానంలో యోగా కేంద్రంతో పాటు ఐఏఎస్ అధికారుల శ్రీమతులు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మేకతోటి సుచరిత ప్రారంభించారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న మహిళా పోలీసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హోంమంత్రి తెలిపారు. మహిళా పోలీసులు పనిచేసేచోట వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన వైద్యులను హోంమంత్రి సన్మానించారు.
Andhra Pradesh
home minister
sucharita
Police
doctors
Guntur District

More Telugu News