Rohit Sharma: ధోనీ, జాదవ్ లపై దుమ్మెత్తిపోస్తున్న అభిమానులకు జవాబిచ్చిన రోహిత్ శర్మ!

  • ఇంగ్లండ్ పై 31 పరుగుల తేడాతో పరాజయం
  • పిచ్ బ్యాటింగ్ కు సహకరించలేదు
  • భారీ షాట్ల కోసం ప్రయత్నించినా, వీలుకాలేదన్న రోహిత్
ఆదివారం నాడు ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా 31 పరుగుల తేడాతో ఓడిపోగా, పరాజయానికి అపార అనుభవమున్న ధోనీ, అతనితో పాటు క్రీజులో ఉన్న కేదార్‌ జాదవ్‌ లే కారణమని అభిమానులు, మాజీలు దుమ్మెత్తిపోస్తున్న వేళ, రోహిత్ శర్మ వారికి అండగా నిలిచాడు. కొన్ని భారీషాట్లు కొడితే విజయం అందుకోవడం అసాధ్యమేమీ కాదన్న సమయంలో వీరిద్దరూ సింగిల్స్ తీశారన్నది ప్రధాన ఆరోపణ.

అయితే, పిచ్‌ పరిస్థితుల దృష్ట్యానే వారి బ్యాటింగ్‌ అలా సాగిందని, బ్యాటింగ్‌ కు ఏమాత్రం అనుకూలించని పిచ్ ఇదని రోహిత్‌ శర్మ అన్నాడు. ధోనీ, జాదవ్‌ లు భారీ షాట్ల కోసం ప్రయత్నించినా, అది సాధ్యం కాలేదని, పరిస్థితులకు అనుగుణంగా ఆడిన ఇంగ్లండ్ జట్టు విజయం సాధించిందని అన్నాడు. కాగా, ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ సెంచరీని సాధించిన సంగతి తెలిసిందే.
Rohit Sharma
India
MS Dhoni
Kedar Jadav

More Telugu News