Andhra Pradesh: తాడేపల్లిలో సహస్ర చండీయాగం.. పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్!

  • ముగింపు కార్యక్రమానికి హాజరైన సీఎం
  • రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని యాగం నిర్వహణ
  • జగన్ చేతుల మీదుగా చండీయాగం పరిసమాప్తం
తాడేపల్లిలోని సీఎస్ఆర్ కల్యాణ మండపంలో ఈరోజు జరుగుతున్న సహస్ర చండీయాగానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. నేడు సహస్ర చండీయాగం ముగియనున్న నేపథ్యంలో జరిగిన కార్యక్రమానికి జగన్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లితో పాటు ముఖ్య నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనీ, వర్షాలు కురవాలని కోరుకుంటూ సహస్ర చండీయాగం చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ చేత ఈ యాగాన్ని పరిసమాప్తం చేయించనున్నారు.
Andhra Pradesh
Jagan
Chief Minister
sahasra chandi yagam

More Telugu News