వైఎస్ జయంతి నుంచే ‘వైఎస్సార్ పెన్షన్ పథకం’ అమలు చేస్తాం!: ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
- నవరత్నాలను జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు
- మా ప్రభుత్వం రైతుల పక్షపాతి
- రైతు భరోసా కింద రూ.12,500 అందిస్తాం
కడప జిల్లాలో జరిగిన ప్రజాపరిషత్తు చివరి సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పుట్టినరోజు అయిన జులై 8 నుంచి ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ను అధికారికంగా ప్రారంభిస్తామని తెలిపారు. జులై 8ని రైతు దినోత్సవంగా జరుపుతామని పునరుద్ఘాటించారు.