Vijay Sai Reddy: బాబు ఇంటికి రోజుకు 300 మంది వచ్చి యాక్షన్ ఇరగదీస్తున్నారు: విజయసాయిరెడ్డి ఎద్దేవా

  • ఎవరో సలహా విని జనాలను పిలిపించుకుంటున్నారు
  • రేకుల షెడ్డును కూల్చేస్తే తెగ ఆవేశం
  • ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి
తనను ఓదార్చేందుకు రోజుకు 300 మందిని చంద్రబాబు తన ఇంటికి పిలిపించుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎవరో ఇచ్చిన సలహాతో, బాగా రిహార్సల్స్ చేసిన వారు చంద్రబాబు ఇంటికి వచ్చి, ఓదార్చి వెళుతున్నారని అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టారు. "ఎవరు సలహా ఇచ్చారో కాని తనను ఓదార్చేందుకు రోజుకు 300 మందిని రప్పించుకుంటున్నారు బాబు. వచ్చిన వాళ్లు బాగా రిహార్సల్ చేసి యాక్షన్ ఇరగదీస్తున్నారు. దేశంలోనే సంపన్నుడైన రాజకీయ నేతను, ఇల్లు లేకపోతే మా ఇంటి కొచ్చి ఉండండయ్యా అనడం డ్రామా కాకపోతే మరేమిటి?" అని అడిగారు.

ఆ తరువాత "ప్రజావేదిక అనే రేకుల షెడ్డును హెరిటేజ్ కంపెనీ డబ్బుతో ఏమైనా కట్టారా లోకేశ్. మీరు, మీ ముఠా సభ్యులు తెగ ఆవేశ పడుతున్నారు. రూ.50 లక్షల విలువ చేయని తాత్కాలిక నిర్మాణానికి రూ.9 కోట్లు దోచుకు తిన్నది బయట పడిందనా ఏడుపులు? కిరాయి మనుషులతో పరామర్శలు, విషాద ఆలాపనలు ఏందయ్యా?" అని ప్రశ్నించారు.
Vijay Sai Reddy
Twitter
Chandrababu

More Telugu News