Polavaram: గోదావరిలో తగ్గిన నీరు... పట్టిసీమకు నీరు బంద్!

  • పోలవరంలో తగ్గిన నీటి మట్టం
  • ఉన్న నీరు గోదావరి జిల్లాలకే
  • మోటార్లను ఆపేసిన అధికారులు
గోదావరికి ఈ సీజన్ లో ఇంకా వరద రాకపోవడంతో, చాలినంత స్థాయిలో నీరు లేక, పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి కృష్ణా నదికి నీటి విడుదల నిలిచిపోయింది. పోలవరంలో గోదావరి నీటిమట్టం 13.95 అడుగులకు చేరగా, ఈ నీరు ఉభయ గోదావరి జిల్లాల ఆయకట్టుకు సాగునీటి నిమిత్తం మాత్రమే సరఫరాకు సరిపోతుందని భావించిన అధికారులు, పట్టిసీమ ఎత్తిపోతల మోటార్లను నిలిపివేశారు. ఈ విషయాన్ని ధవళేశ్వరం హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ ఎస్‌ఈ ఎన్‌ కృష్ణమూర్తి వెల్లడించారు. గత నెల 26 నుంచి రెండు పైపుల ద్వారా రోజుకు 700 క్యూసెక్కుల నీటి చొప్పున 5 రోజుల్లో 3,500 క్యూసెక్కుల నీటిని కృష్ణానదికి విడుదల చేశామని తెలిపిన ఆయన, ప్రస్తుతం మోటార్లను ఆపేశామని అన్నారు. ఎగువన వర్షాలు కురిసి, తిరిగి వరద నీరు చేరితే, కృష్ణానదికి నీటిని విడుదల చేస్తామన్నారు.
Polavaram
Pattiseema
Water
Godavari
Krishna

More Telugu News