Dubai ruler: అమె చచ్చినా నేను పట్టించుకోను.. 31 మిలియన్ పౌండ్లతో పరారైన భార్యపై దుబాయ్ రాజు స్పందన

  • ఇద్దరు కుమారులతో పరారైన రాణి
  • లండన్‌లో ఉన్నట్టు అనుమానం
  • భార్య పరారీపై స్పందించిన రాజు
31 మిలియన్ పౌండ్లతో ఇద్దరు పిల్లలను తీసుకుని పరారైన భార్యపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రధాని, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్(69) స్పందించారు. ఆమె ఎక్కడికి వెళ్లినా తనకు అవసరం లేదని, ఆమె చచ్చినా, బతికినా తాను పట్టించుకోబోనని రాజు స్పష్టం చేశారు. అంతేకాదు, ‘నువ్వు ఎవరితో బిజీగా ఉన్నావో’ అంటూ అనుమానం వ్యక్తం చేశారు.

బిలియనీర్ అయిన దుబాయ్ రాజు షేక్ మహమ్మద్‌కు హయా బింట్ అల్ హుస్సైన్ (45) ఆరో భార్య. ఇటీవలే భర్తతో తెగదెంపులు చేసుకున్న ఆమె, తన ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్లిపోయింది. భార్య తీరుపై దుబాయ్ రాజు మాట్లాడుతూ.. ‘‘అబద్ధాలు చెప్పే నీ రోజులు ఇక ముగిశాయి. ఇక నువ్వేంటి? మనమేంటి? అన్నదాన్ని నేను పట్టించుకోను. ఇక నా దగ్గర నీకు చోటులేదు. ఎవరితో బిజీగా ఉండేందుకు వెళ్లావో. నువ్వు బతికున్నా.. చనిపోయినా నాకు లెక్కలేదు’’ అని షేక్ తేల్చి చెప్పారు. కాగా, హయా బింట్ లండన్‌లో ఉన్నట్టు భావిస్తున్నారు.
Dubai ruler
Haya Bint Al Hussein
Princess
Sheikh Mohammed bin Rashid Al Maktoum

More Telugu News