america: రన్‌వేపై హ్యాంగర్‌ను ఢీకొట్టి బూడిదైన విమానం.. పదిమంది సజీవ దహనం

  • అమెరికాలోని టెక్సాస్‌లో ఘటన
  • విమానం టేకాఫ్ అవుతుండగా ప్రమాదం 
  • మంటలు చెలరేగడంతో కుప్పకూలిన విమానం
టేకాఫ్ సమయంలో రన్‌వేపై విమానాలు నిలిపి ఉంచే హ్యాంగర్‌ను ఢీకొన్న ఓ చిన్న విమానం కాలిబూడిదైంది. అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిందీ ఘటన. రెండు ఇంజిన్లు కలిగిన చిన్నపాటి ప్రైవేటు విమానం టేకాఫ్ అవుతూ హ్యాంగర్‌ను ఢీకొట్టింది. క్షణాల్లోనే మంటలు చెలరేగడంతో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న పదిమంది సజీవ దహనమయ్యారు.

అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. టేకాఫ్ అవుతూ హ్యాంగర్‌ను విమానం ఎందుకు ఢీకొట్టిందన్న విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
america
Texas
flight
accident

More Telugu News