Tollywood: టాలీవుడ్ నిర్మాతల మండలి ఎన్నికల్లో అధ్యక్షుడిగా సి.కల్యాణ్ విజయం

  • టాలీవుడ్ నిర్మాతల మండలికి ఎన్నికలు
  • సి. కల్యాణ్ కు 378 ఓట్లు
  • ఆయన ప్రత్యర్థికి 95 ఓట్లు
ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ టాలీవుడ్ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇవాళ జరిగిన ఎన్నికల్లో సి. కల్యాణ్ కు 378 ఓట్లు పోలవగా, ఆయన ప్రత్యర్థి ఆర్కే గౌడ్ కు 95 ఓట్లు మాత్రమే లభించాయి. మరో నాలుగు ఓట్లు చెల్లవని తేల్చారు. ఈ ఎన్నికల్లో 'మన కౌన్సిల్ మన ప్యానెల్' పేరుతో రంగంలోకి దిగిన జట్టు విజయం సాధించింది. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా సి.కల్యాణ్, ఉపాధ్యక్షులుగా కె.అశోక్ కుమార్, వైవీఎస్ చౌదరి, కార్యదర్శిగా టి.ప్రసన్నకుమార్, సంయుక్త కార్యదర్శిగా వడ్లపట్ల మోహన్, కోశాధికారిగా చదలవాడ శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. బండ్ల గణేశ్ ఈసీ మెంబర్ గా ఎన్నికయ్యారు.
Tollywood
Kalyan

More Telugu News