బ్యాట్‌తో కొట్టినందుకు బాధలేదు.. మరోసారి బ్యాటింగ్ చేసే అవకాశం రాకూడదని కోరుకుంటున్నా: ఎమ్మెల్యే ఆకాశ్
- పాత భవనాన్ని కూల్చుతుండగా అడ్డుకున్న ఆకాశ్
- క్రికెట్ బ్యాట్‌తో అధికారిపై దాడి
- అరెస్ట్ చేసి జైలుకు తరలించిన పోలీసులు
నేడు ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆకాశ్ మీడియాతో మాట్లాడతూ, తాను అధికారిపై దాడి చేసినందుకు బాధ పడటం లేదని, మళ్లీ బ్యాటింగ్ చేయాల్సిన అవసరం తనకు కల్పించొద్దని భగవంతుణ్ని వేడుకుంటున్నానన్నారు. పోలీసుల ముందే ఓ మహిళతో దురుసుగా ప్రవర్తించిన అధికారిని అంతకంటే ఏం చేయాలో తనకు అర్థం కాలేదని ఆకాశ్ పేర్కొన్నారు.