నా తమ్ముడు అటవీ అధికారులపై దాడికి పాల్పడలేదు: ఎమ్మెల్యే కోనప్ప
- ట్రాక్టర్లను ఎందుకు తీసుకొచ్చారు?
- అధికారికి గాయాలవడం బాధాకరం
- అటవీ అధికారులు రాజకీయం చేస్తున్నారు
అటవీ అధికారులు నేడు కాగజ్‌నగర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యామ్నాయ అటవీకరణ పనులు నిర్వహిస్తున్నారన్న విషయం తెలుసుకున్న జడ్పీ వైస్ చైర్మన్, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ ఆ ప్రాంతానికి వచ్చి పనులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో అటవీ అధికారులకు, కృష్ణ వర్గీయులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో రెచ్చిపోయిన కృష్ణ, ఆయన అనుచరులు రేంజ్ అధికారి అనితతో పాటు సిబ్బందిపై దాడి చేశారు.