Chandrababu: సినీనటుడు కృష్ణను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు

  • విజయ నిర్మల మృతికి సంతాపం
  • చిత్రపటం వద్ద నివాళులర్పించిన బాబు
  • కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపిన చంద్రబాబు
సినీ నటి, దర్శకురాలు, సూపర్‌స్టార్‌ కృష్ణ భార్య విజయనిర్మల ఆకస్మిక మృతి దిగ్భ్రాంతి కలిగించిందని, ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో సినీనటుడు కృష్ణతోపాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. తొలుత విజయనిర్మల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె గదిలో చిత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విలువలతో కూడిన జీవిత ప్రయాణం కృష్ణ దంపతులదని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నానని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, సినీనటుడు బాలకృష్ణ కూడా ఉన్నారు.
Chandrababu
superstar krishna
vijayanirmala

More Telugu News