Rajasthan: అదుపుతప్పిన హెలికాప్టర్.. చావును దగ్గరగా చూసివచ్చిన బీజేపీ ఎంపీ!

  • రాజస్థాన్ లోని ఆళ్వార్ లో ఘటన
  • టేకాఫ్ సందర్భంగా అదుపుతప్పిన హెలికాప్టర్
  • చివరకు హెలికాప్టర్ ను అదుపులోకి తీసుకొచ్చిన పైలెట్
జీవితం విలువ అన్నది చావు దగ్గరయితే కానీ తెలియదని కొందరు పెద్దలు చెబుతుంటారు. తాజాగా బీజేపీ నేత మహంత్ బాలక్ నాథ్ కు ఈ అనుభవం ఎదురయింది. బీజేపీ నుంచి ఆళ్వార్ లోక్ సభ సభ్యుడిగా మహంత్ ఇటీవల గెలుపొందారు. ఈ నేపథ్యంలో సొంత నియోజవకర్గంలో ఆయన పర్యటించారు. పర్యటన ముగించుకుని హెలికాప్టర్ లో తిరుగు ప్రయాణం అయ్యారు.

అయితే గాల్లోకి అలా లేచిన హెలికాప్టర్ ఒక్కసారిగా అదుపు తప్పింది. గాల్లోనే గిరగిరా తిరగడం మొదలుపెట్టింది. దీంతో హెలికాప్టర్ కూలిపోతుందేమో? అని ప్రజలు, బీజేపీ నేతలు భయాందోళనకు గురయ్యారు. కానీ చివరికి హెలికాప్టర్ ను అదుపులోకి తీసుకొచ్చిన పైలెట్ దాన్ని ముందుకు తీసుకెళ్లాడు. దీంతో అక్కడివారంతా ఊపిరి పీల్చుకున్నారు.
Rajasthan
helicopter
BJP
mahanth balaknath
Twitter
mp
alwar

More Telugu News