Telangana: దొంగలకే షాకిచ్చిన మహిళ.. వీడియోను పోస్ట్ చేసిన రాచకొండ పోలీసులు!

  • పర్సు లాక్కోవడానికి వచ్చిన దొంగలు
  • వెనకే ఉన్న ఇంట్లోకి విసిరేసిన మహిళ
  • భయంతో పారిపోయిన దొంగలు
సాధారణంగా దొంగలు దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది భయంతో కేకలు వేస్తారు. మరికొందరు పారిపోయే ప్రయత్నం చేస్తారు. అయితే చాలాకొద్ది మంది మాత్రం సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. తాజాగా అలాంటి ఘటనే ఈరోజు వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను రాచకొండ పోలీసులు విడుదల చేశారు. బైక్ పై వచ్చిన ఇద్దరు దొంగలు రోడ్డుపక్కనే నిలబడి ఉన్న ఓ మహిళ పర్సును లాక్కోవడానికి ప్రయత్నించారు.

అయితే సదరు దొంగను కొద్దిదూరంలోనే గమనించిన మహిళ.. తెలివిగా తన పర్సును వెనకాలే ఉన్న ఓ ఇంట్లోకి విసిరేసింది. అనంతరం దొంగకు చిక్కకుండా పారిపోయింది. దీంతో తాము దొరికిపోతామన్న భయంతో బైక్ పై ఇద్దరు దొంగలు ఉడాయించారు. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన రాచకొండ పోలీసులు ‘కొంచెం సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే మీ పర్సును ఇలా కాపాడుకోవచ్చు’ అని ట్వీట్ చేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయమై స్పష్టత ఇవ్వలేదు.
Telangana
Police
rachakonda
video
Twitter

More Telugu News