VVS Lakshman: వరల్డ్ కప్ ఫైనల్ వీరిమధ్యే: వీవీఎస్ జోస్యం

  • ఇండియా, ఆసీస్ ల మధ్యే పోరు
  • ఈ రెండు జట్ల నుంచే విజేత
  • బలంగా కనిపిస్తున్న ఇండియా
  • వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యలు
ఈ వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరగనుందని స్టయిలిష్ బ్యాట్స్ మెన్, మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ జోస్యం చెప్పారు. 2003 ఫైనల్లో పోటీ పడిన భారత్, ఆసీస్ లే ఈ దఫా కూడా ఫైనల్ ఆడనున్నాయని, లార్డ్స్‌ మైదానం వేదికగా జరిగే మ్యాచ్ లో ఈ రెండు జట్ల నుంచే విజేత ఉద్భవించనుందని అన్నాడు. ప్రస్తుతం ఇండియా ఎంతో దుర్భేద్యంగా ఉందని, అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో చాలా బలంగా కనిపిస్తోందని అన్నారు.

జస్ ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, భువనేశ్వర్‌ లు జట్టుకు అదనపు బలమని అన్నారు. ఆట మిడిల్‌ ఓవర్లలో ఎంఎస్ ధోనీ కీలకమైన ఆటగాడని, అతను తన స్ట్రయిక్ ను మరింతగా రోటేట్ చేయాలని సూచించారు. నేడు ఇంగ్లండ్ తో జరిగే మ్యాచ్ లో ఇండియా ఫేవరెట్ అని చెప్పారు. కాగా, ఆఫ్గన్, వెస్టిండీస్ లలో ధోనీ ఆడిన తీరుపై లక్ష్మణ్ సంచలన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

నెమ్మదిగా ఆడుతున్నందుకు ధోనీ ఏదో ఒక రోజు తప్పకుండా చింతిస్తాడని లక్ష్మణ్‌ వ్యాఖ్యానించగా, పలువురు మాజీ క్రికెటర్లు ఆయన వ్యాఖ్యలను ఖండించారు కూడా.
VVS Lakshman
India
Cricket
England
Australia

More Telugu News