Kishan Reddy: హోమ్ శాఖలో కిషన్ రెడ్డికి మరిన్ని బాధ్యతలు అప్పగించిన అమిత్ షా

  • కీలక నిర్ణయం తీసుకున్న అమిత్ షా
  • వామపక్ష తీవ్రవాద విభాగం, మహిళల భద్రత కిషన్ రెడ్డికే
  • జ్యుడీషియల్ డివిజన్ కూడా
కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి మరిన్ని బాధ్యతలు అప్పగిస్తూ, హోమ్ మంత్రి అమిత్ షా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వామపక్ష తీవ్రవాద విభాగం, పోలీసు శాఖ ఆధునికీకరణ బాధ్యతలను కిషన్ రెడ్డికి అప్పగించారు. వీటితో పాటు మహిళల భద్రత జ్యుడీషియల్ డివిజన్ లను కూడా కిషన్ రెడ్డికే అప్పగిస్తున్నట్టు హోమ్ శాఖ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విభాగాలన్నీ తక్షణం కిషన్ రెడ్డి పరిధిలోకి వస్తాయని పేర్కొంది.
Kishan Reddy
Amit Shah
Home

More Telugu News