BJP: టీడీపీలో చంద్రబాబు తర్వాత కొడుకు లోకేశే పగ్గాలు చేపడతాడు... బీజేపీలో అలా కాదు: పురందేశ్వరి

  • బీజేపీలో ప్రతిభకు పట్టం కడతారు
  • కష్టపడేవాళ్లకు ప్రతిఫలం దొరికేది బీజేపీలోనే
  • టీడీపీ కూడా కుటుంబ పార్టీనే
దేశంలో చాలా పార్టీలు కుటుంబ పార్టీలుగా ఉన్నాయని బీజేపీ నేత పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ కూడా అందుకు మినహాయింపు కాదని, చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టేది లోకేశేనని అన్నారు.  అయితే, బీజేపీలో మాత్రం ప్రతిభకు పట్టం కడతారని, కష్టపడేవాళ్లకు తప్పకుండా ప్రతిఫలం దొరికేది బీజేపీలో మాత్రమేనని పురందేశ్వరి స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీది చారిత్రక విజయం అని ఆమె కీర్తించారు. బీజేపీ గెలుపు పేద, మధ్య తరగతి ప్రజల గెలుపుగా భావిస్తున్నామని చెప్పారు.
BJP
Telugudesam
Chandrababu
Nara Lokesh
Purandeswari

More Telugu News