Nara Lokesh: మీరేమైనా చంచల్ గూడ జైలు నుంచి వీసాపై వచ్చారా?: విజయసాయిపై బుద్ధా సెటైర్లు

  • దొంగ లెక్కల దొరా అంటూ వ్యంగ్యం
  • త్వరలోనే మోదీ చేతిలో మూడిందంటూ హెచ్చరిక
  • లోకేశ్ ఓడినా జనహృదయాల్లో గెలిచాడంటూ కితాబు
వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. దొంగల లెక్కల దొరా, తమరు చీకట్లో చిదంబరం ఇంట్లో ఏంచేస్తున్నట్టో! నరేంద్ర మోదీ మెడలు వంచుతామని వెళ్లి కాళ్లపై పడ్డారంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 'తలపండిన మేతా'వి సాయిరెడ్డి గారూ, చిదంబరం, ఆయన కొడుకు బెయిల్ పై బయటున్నారా? మీరేమైనా చంచల్ గూడ జైలు నుంచి వీసాపై బయటికొచ్చారా? అంటూ సెటైర్ విసిరారు. మీ అక్రమాస్తుల ముఠా త్వరలోనే మోదీ చేతిలో చిత్తవడం ఖాయం అంటూ బుద్ధా హెచ్చరించారు.

మంగళగిరిలో లోకేశ్ ఓటమిపాలైనా లక్షకు పైగా ఓట్లు సాధించి జనహృదయాల్లో విజేతగా నిలిచారంటూ వ్యాఖ్యానించారు. తమరేమో లక్ష కోట్లు దోపిడీ చేసినందుకు క్విడ్ ప్రో కో ద్వారా ఎంపీ అయ్యారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో నారా లోకేశ్, చంద్రబాబులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బుద్ధా తాజా వ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతోంది.
Nara Lokesh
Vijay Sai Reddy

More Telugu News