Mallesham: మల్లేశం స్ఫూర్తిగా ఆసు యంత్రాల కొనుగోలుకు లక్ష రూపాయల విరాళం ప్రకటించిన కె.రాఘవేంద్రరావు

  • మల్లేశం చిత్రాన్ని వీక్షించిన దర్శకేంద్రుడు
  • చిత్రయూనిట్ కు అభినందనలు
  • చింతకింది మల్లేశం అభినందనీయుడు అంటూ ట్వీట్
చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన ఆసు యంత్రాన్ని కనిపెట్టిన చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా 'మల్లేశం' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వీక్షించిన అనంతరం దర్శకుడు కె.రాఘవేంద్రరావు చిత్రబృందానికి శుభాభినందనలు తెలియజేశారు. అంతేగాకుండా, చేనేత కార్మికులకు ఎంతో ఉపయోగపడే ఆసు యంత్రాల కొనుగోలు కోసం లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు.

కార్మికురాలిగా తన తల్లి పడుతున్న కష్టాలు చూడలేక, గొప్ప చదువులు లేకపోయినా ఆసు యంత్రాన్ని కనిపెట్టిన చింతకింది మల్లేశం నిజంగా స్ఫూర్తిప్రదాత అని, అభినందనీయుడు అని రాఘవేంద్రరావు ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. మల్లేశం జీవితాన్ని తెరకెక్కించడం ద్వారా దర్శకుడు రాజ్ మంచి ప్రయత్నం చేశాడని అభినందించారు. ప్రియదర్శి, అనన్య, ఝాన్సీ ఇతర నటీనటులు మెరుగైన నటన కనబర్చారని దర్శకేంద్రుడు కితాబిచ్చారు.
Mallesham
Raghavendrarao
Tollywood

More Telugu News