Tarun Kumar: పార్టీ పదవికి మరో కాంగ్రెస్ నేత రాజీనామా

  • ఎన్నికల్లో ఘోర పరాభవానికి నేను ఒక కారణం
  • దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నా
  • పార్టీ విజయానికి కార్యకర్తలంతా కృషి చేశారు
ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ఏఐసీసీ అద్యక్షుడిగా తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా పదవుల్లో ఉన్న పెద్దలంతా సమష్టి బాధ్యత వహించాలంటూ పేర్కొనడంతో అన్ని రాష్ట్రాల నుంచి ముఖ్య నేతలు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. నిన్న దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాజీనామాల పర్వం కొనసాగింది.

నేడు కూడా మరో కీలక నేత, రాహుల్‌కు లేఖ రాయడంతో పాటు తన పదవికి రాజీనామా చేశారు. ఏఐసీసీ సెక్రెటరీ, రాజస్థాన్ కో- ఇన్‌చార్జీ తరుణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. కో-ఇన్‌చార్జిగా ఉన్న తాను ఎన్నికల్లో ఘోర పరాభవానికి ఒక కారణమని, అందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. పార్టీ విజయానికి కార్యకర్తలంతా కృషి చేశారని, కానీ ఫలితం పొందలేకపోయామని, దీనికి అంతా నైతిక బాధ్యత వహించాల్సిందేనంటూ తరుణ్ లేఖలో స్పష్టం చేశారు.
Tarun Kumar
Co-Incharge
Rahul Gandhi
Resign
Congress

More Telugu News