KTR: పార్టీ కార్యాలయాల నిర్మాణానికి కేటీఆర్ నెల జీతం విరాళం

షార్ట్స్‌లో చూడండి
ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలను టీఆర్ఎస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో కార్యాలయాల నిర్మాణాలకు పార్టీ నేతలు, కార్యకర్తలు తమవంతు విరాళాలను అందిస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కూడా తన వంతుగా నెల జీతం రూ. 2.50 లక్షలను విరాళంగా ఇస్తున్నానని ప్రకటించారు.

సిరిసిల్లలో జరుగుతున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఈరోజు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2001లో చిన్న మొక్కగా ప్రారంభమైన పార్టీ ఈరోజు అన్ని జడ్పీ స్థానాలను గెలుచుకునే స్థాయికి ఎదిగిందని చెప్పారు. పార్టీ కార్యాలయానికి స్థలం కూడా లేని స్థాయి నుంచి జూబ్లీహిల్స్ లో భవనం కట్టుకునే స్థాయికి ఎదిగామని అన్నారు. ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకే అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మిస్తున్నామని చెప్పారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు రూ. 40 లక్షల విరాళాలు వచ్చాయని తెలిపారు.
Go Back to Shorts
KTR
TRS
donation

More Telugu News