Revanth Reddy: కాంగ్రెస్ భవిష్యత్ ప్రయోజనాల కోసమే పార్టీ పదవికి రాజీనామా చేశా: రేవంత్ రెడ్డి

  • వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రేవంత్ రాజీనామా
  • రాహుల్ స్ఫూర్తిగా నిర్ణయం తీసుకున్నానంటున్న ఎంపీ
  • ఇప్పటికే పెద్ద సంఖ్యలో రాజీనామాలు
సార్వత్రిక ఎన్నికల్లో దారుణ వైఫల్యానికి బాధ్యత తీసుకుంటూ ఏఐసీసీ అధ్యక్షుడిగా తప్పుకుంటున్నట్టు రాహుల్ గాంధీ ప్రకటించడం కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ పగ్గాలు మీ చేతుల్లోనే ఉండాలంటూ సీనియర్ నేతలు సహా ఎవరు చెప్పినా రాహుల్ వినిపించుకోవడంలేదు. అంతేకాదు, పార్టీ పరాజయానికి పదవుల్లో వున్న పెద్దలంతా సమష్టి బాధ్యత తీసుకోవాలంటూ ఆయన వ్యాఖ్యానించడం సంచలనమైంది. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు పదవులకు రాజీనామాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఎంపీ రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడిచారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. రాహుల్ గాంధీ నిర్ణయం స్ఫూర్తిగానే తాను పదవి నుంచి వైదొలగినట్టు రేవంత్ స్పష్టం చేశారు. పదవిలో లేకపోయినా పార్టీని పటిష్టపరిచేందుకు తనవంతు సహకారం అందిస్తామని వివరించారు.
Revanth Reddy
Telangana
Congress

More Telugu News