Kesineni Nani: ఇద్దరు సీఎంలు వారానికొకసారి కలుసుకుని దీనిపై చర్చిస్తున్నారు: కేశినేని నాని

  • హైదరాబాద్ అభివృద్ధి గురించి చర్చించుకుంటున్నారు
  • టీడీపీ పాలనే బాగుందని జనాలు అనుకుంటున్నారు
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుంది
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శనాస్త్రాలను ఎక్కుబెడుతూనే ఉన్నారు. ప్రతి వారం ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు కలుసుకుంటున్నారని... హైదరాబాద్ అభివృద్ధి గురించి చర్చించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కూల్చివేతలతో పరిపాలనను జగన్ ప్రారంభిస్తే... నిర్మాణాల ప్రారంభోత్సవాలతో కేసీఆర్ పాలనను ప్రారంభించారని చెప్పారు. గతంలో హైదరాబాదు అభివృద్ధి కోసం, ఇప్పుడు అమరావతి అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని అన్నారు. టీడీపీ పాలనే బాగుందని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. విజయవాడలో మెజార్టీ ప్రజలు టీడీపీ వైపే ఉన్నారని... స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమని తెలిపారు.
Kesineni Nani
jagan
kcr

More Telugu News