Teamindia: హోటల్లో టీమిండియా ఆటగాళ్ల కుటుంబసభ్యులను ఫొటోలు తీస్తూ అపరిచితుల కలకలం!

  • రేపు బర్మింగ్ హామ్ లో ఇంగ్లాండ్ తో మ్యాచ్
  • బర్మింగ్ హామ్ లోని హయాట్ రీజెన్సీలో బసచేసిన ఆటగాళ్లు
  • ముగ్గురు వ్యక్తులపై హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన టీమిండియా
విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు ఆతిథ్య ఇంగ్లాండ్ తో రేపు బర్మింగ్ హామ్ లో వరల్డ్ కప్ మ్యాచ్ ఆడనుంది. ఈ కీలకమైన లీగ్ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు బర్మింగ్ హామ్ చేరుకున్నారు. అయితే, టీమిండియా ఆటగాళ్లు బసచేసిన హయాట్ రీజెన్సీ హోటల్ లో ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి కలకలం సృష్టించారు. ఆటగాళ్లను, వారి కుటుంబసభ్యులను ఫొటోలు తీస్తూ హోటల్ లో ఇబ్బందికర వాతావరణం సృష్టించారు.

ఆ ముగ్గురు వ్యక్తులు ఆటగాళ్లు ఉంటున్న గదుల చుట్టూ తిరుగుతూ, తీవ్ర అసౌకర్యానికి గురిచేశారు. దాంతో ఒళ్లుమండిన భారత జట్టు సభ్యులు మేనేజ్ మెంట్ కు దీనిపై సమాచారం అందించగా, మేనేజ్ మెంట్ వెంటనే స్పందించి హోటల్ యాజమాన్యానికి గట్టిగా ఫిర్యాదు చేసింది. దాంతో, హోటల్ యాజమాన్యం వెంటనే రంగంలోకి దిగి ఆ ముగ్గుర్ని తీవ్రంగా హెచ్చరించి అక్కడినుంచి పంపించివేసింది.  
Teamindia
England
Hotel
World Cup

More Telugu News