Andhra Pradesh: నారా లోకేశ్ పై విజయసాయిరెడ్డి విమర్శలకు బుద్ధా వెంకన్న కౌంటర్!

  • ముందు కోర్టుల విచారణకు హాజరవ్వు
  • తర్వాత లోకేశ్ గురించి తీరిగ్గా మాట్లాడుకుందాం
  • కేసులు తేలితే మొత్తం ‘ఏ’ బ్యాచ్ పోటీకి పనికిరాకుండా పోతుందని ఎద్దేవా
టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేశ్ పై ఈరోజు వైసీపీ నేత విజయసాయిరెడ్డి తీవ్రంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను తిప్పికొట్టారు. విజయసాయిరెడ్డి చీకటి బతుకు త్వరలోనే బయటపడబోతోందని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డిది ‘ఏ’ కుటుంబమని ఆయన ఎద్దేవా చేశారు.

‘ఈ కేసులు కోర్టుల్లో తేలితే.. మీ బ్యాచ్ మొత్తం పోటీకి కూడా పనికిరాకుండా పోతారు’ అని హెచ్చరించారు. విజయసాయిరెడ్డి ముందుగా కోర్టుల విచారణకు హాజరుకావాలనీ, ఆ తర్వాత లోకేశ్ వంటి నాయకుల గురించి తీరిగ్గా మాట్లాడుకోవచ్చని ఎద్దేవా చేశారు. ఇతరుల గురించి మాట్లాడేముందు తన స్థాయి ఏంటో గుర్తుపెట్టుకోవాలని విజయసాయిరెడ్డికి హితవు పలికారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు.
Andhra Pradesh
YSRCP
Telugudesam
Vijay Sai Reddy
BUDHA VENKANNA

More Telugu News