kcr: రాతపూర్వకంగా ఒప్పందాలను చేసుకోవాలి: జగన్ కు పౌర నిఘా వేదిక సలహా

  • సుస్థిర పాలనను జగన్ అందిస్తున్నారు
  • జగన్ హయాంలో స్వర్ణయుగం రానుంది
  • ఒప్పందాల విషయంలో జగన్ జాగ్రత్తలు తీసుకోవాలి
జగన్ సారధ్యంలో ఏపీలో సుస్థిర పాలన కొనసాగుతోందని పౌర నిఘా వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంవీ రాజగోపాల్ అన్నారు. లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అందించాలనుకున్న పాలనను జగన్ అందిస్తున్నారని కితాబిచ్చారు. కాంట్రాక్టుల్లో అవినీతిని నిర్మూలించేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జికి ప్రధాన పాత్రను కల్పించడం అభినందనీయమని చెప్పారు. జగన్ హయాంలో స్వర్ణయుగం రానుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలసి పని చేయడం స్వాగతించదగ్గ విషయమని... అయితే, కేసీఆర్ చెప్పే మాటలు, హామీలను నమ్మాల్సిన అవసరం లేదని చెప్పారు. ఒప్పందాల విషయంలో జగన్ జాగ్రత్తలు తీసుకోవాలని... రాతపూర్వకంగా ఒప్పందాలను కుదుర్చుకోవాలని అన్నారు. ప్రత్యేక హోదాను సాధించేందుకు జగన్ కృషి చేయాలని చెప్పారు. పౌర నిఘా వేదిక మంచిని ప్రోత్సహిస్తుందని... చెడును ఖండిస్తుందని తెలిపారు.
kcr
jagan
ysrcp
TRS
poura nigha vedika

More Telugu News