భారత్ 5000 పేజీల ఆధారాలు సమర్పించడంతో నీరవ్ మోదీ షాక్... ల్యాప్ టాప్ కావాలంటూ కోర్టుకు విజ్ఞప్తి!
- న్యాయమూర్తికి విన్నవించిన మోదీ తరఫు న్యాయవాది
- సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి
- పీఎన్ బీ కేసులో లండన్ పారిపోయిన నీరవ్ మోదీ
అయితే, తన క్లయింటు ఈ పేజీలన్నింటినీ పరిశీలించి తనపై వచ్చిన ఆరోపణలకు తగిన విధంగా స్పందించాలంటే ఓ ల్యాప్ టాప్ అవసరమని నీరవ్ తరఫు న్యాయవాది జెస్సికా జోన్స్ కోర్టుకు విన్నవించారు. "నా క్లయింట్ తో స్వల్ప సమయంలో ఇన్ని పేజీలపై చర్చించాలంటే చాలాకష్టం" అంటూ పేర్కొన్నారు. ఆ ల్యాప్ టాప్ కు ఇంటర్నెట్ సదుపాయం అక్కర్లేదని, ఆ 5000 పేజీల సమాచారాన్ని అందులోకి లోడ్ చేస్తే సరిపోతుందని జెస్సికా జోన్స్ చెప్పారు. దాంతో ఆయన నీరవ్ మోదీకి అనుకూలంగా ఉత్తర్వులు ఇస్తూ అతనికి సహకరించాల్సిందిగా జైలు వర్గాలను ఆదేశించారు.