botsa: వ్యక్తిగత కక్షలు మాకు లేవు.. అందరికీ నోటీసులు ఇస్తాం: బొత్స

  • ఉండవల్లిలో ఉన్నది చంద్రబాబు సొంత నివాసం కాదు
  • ప్రభుత్వానికి సహకరించాలి
  • విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరిపిస్తాం
ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న భవనానికి నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఉండవల్లిలో ఉన్నది చంద్రబాబు సొంత నివాసం కాదని చెప్పారు. లింగమనేని రమేశ్ కు చెందిన భూమిలో శాశ్వత నిర్మాణాలు చేయకూడదనే నిబంధన ఉందని అన్నారు. తమకు ఎవరి మీద వ్యక్తిగత కక్ష లేదని... చంద్రబాబు ఉంటున్న నివాసానికే కాకుండా, అక్రమ నిర్మాణాలు ఉన్న అందరికీ నోటీసులు ఇస్తామని చెప్పారు. చేసిన తప్పును తెలుసుకోవాలని... ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరిపిస్తామని చెప్పారు.
botsa
chandrababu
lingamaneni
Telugudesam
ysrcp

More Telugu News