jagan: రెండు తెలుగు రాష్ట్రాలకు నీటిని అందించడమే మా లక్ష్యం: జగన్

  • కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువగా ఉంది
  • గోదావరి నీటిని శ్రీశైలంకు తరలించడం ద్వారా సమస్యను అధిగమించవచ్చు
  • రాయలసీమ, పాలమూరు, నల్గొండ జిల్లాలకు నీటిని అందించవచ్చు
ఏపీ, తెలంగాణలు వేర్వేరు కాదని, రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలనేదే తమ అభిమతమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. హైదరాబాదులోని ప్రగతి భవన్ లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువగా ఉందని... గోదావరి నీటిని కృష్ణకు తరలించడం ద్వారా నీటి సమస్యను అధిగమించవచ్చని చెప్పారు. గోదావరి నీటిని శ్రీశైలంకు తరలించడం ద్వారా రాయలసీమ, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు నీటిని అందించవచ్చని చెప్పారు. గోదావరి నీటిని శ్రీశైలంకు తరలించే అంశంపై అధ్యయనం చేసి, నివేదికను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
jagan
kcr
krishna
godavari

More Telugu News