KTR: ఇకపై కేసీఆర్ ఆటలు సాగవు: బీజేపీ నేత పెద్దిరెడ్డి

  • టీఆర్ఎస్ పై పోరాటం చేసే సత్తా బీజేపీకి ఉంది
  • బీజేపీలో చేరేందుకు అనేక మంది సిద్ధమవుతున్నారు
  • కేటీఆర్ కోసమే కొత్త సచివాలయాన్ని కేసీఆర్ నిర్మిస్తున్నారు
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష టీఆర్ఎస్ పాలనలో నెరవేరడం లేదని బీజేపీ నేత పెద్దిరెడ్డి అన్నారు. తెలంగాణకు బీజేపీ అవసరం చాలా ఉందని చెప్పారు. హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ పై పోరాటం చేయగల సత్తా ఉన్న పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు. బీజేపీలో చేరేందుకు అనేక మంది సిద్ధమవుతున్నారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీ పట్ల ఆకర్షితులవుతున్నారని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ పై తిరుగుబాటు ప్రారంభమైందని... ఇకపై కేసీఆర్ ఆటలు సాగవని అన్నారు. కొడుకు కేటీఆర్ కోసమే కొత్త సచివాలయాన్ని కేసీఆర్ నిర్మిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే కేసీఆర్ ఆలోచన దుర్మార్గమని అన్నారు.
KTR
kcr
TRS
peddireddy
bjp

More Telugu News