Vijay Sai Reddy: బాబు నిర్మించిన ఆ కట్టడాలు కుల మీడియాకు చారిత్రక నిర్మాణాల్లా కనిపిస్తున్నాయేమో!: విజయసాయిరెడ్డి

  • అక్రమ కట్టడాలపై విజయసాయి ట్వీట్
  • బాబు అనుకూల మీడియా అంటూ పరోక్ష వ్యాఖ్యలు
  • చట్టాలు చదవాలంటూ మీడియాకు హితవు
ట్విట్టర్ ను వేదికగా చేసుకుని ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించడం అలవాటుగా చేసుకున్న వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ప్రజావేదిక కూల్చివేత అనంతరం అక్రమకట్టడాలు, కూల్చివేతల అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నేపథ్యంలో, మీడియాలో ఓ వర్గం మళ్లీ చంద్రబాబు పల్లకీ సేవ మొదలుపెట్టిందంటూ విజయసాయిరెడ్డి ఆరోపించారు. నదిని పూడ్చి నిర్మించిన కట్టడాలు అక్రమ నిర్మాణాలని నదీ పరిరక్షణ చట్టం, ఎన్జీటీ, సీఆర్డీఏ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని, కానీ, అవన్నీ బాబు నిర్మించిన కట్టడాలు కావడంతో కుల మీడియాకు చారిత్రక నిర్మాణాల్లా కనిపిస్తున్నాయని వ్యంగ్యం ప్రదర్శించారు. మీడియా కూడా చట్టాలు, నిబంధనల గురించి తెలుసుకోవాలని విజయసాయి హితవు పలికారు.
Vijay Sai Reddy
Chandrababu
Telugudesam
YSRCP
Andhra Pradesh
Media

More Telugu News