Andhra Pradesh: ఎన్టీఆర్-పీవీ నరసింహారావుతో దిగిన ఫొటోను పంచుకున్న చంద్రబాబు!
- పీవీ నరసింహారావు బహుభాషావేత్త, రచయిత
- ఏపీ సీఎంగా, పీఎంగా పనిచేసిన ఏకైక తెలుగు వ్యక్తి
- నివాళులు అర్పించిన టీడీపీ అధినేత
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావులో బహుభాషావేత్త, రచయిత, రాజనీతిజ్ఞుడు ఉన్నారని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా పనిచేసిన ఏకైక తెలుగు వ్యక్తి పీవీ నరసింహారావేనని ప్రశంసించారు. ఈరోజు పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన అమూల్యమైన సంస్కరణలను తెచ్చి అభివృద్ధికి బాటలు పరిచిన దార్శనికుడు పీవీ అని చంద్రబాబు కితాబునిచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, పీవీ నరసింహారావుతో కలిసి దిగిన ఓ ఫొటోను చంద్రబాబు అభిమానులు, ప్రజలతో ట్విట్టర్ లో పంచుకున్నారు.