Andhra Pradesh: పీవీ నరసింహారావు అపర చాణక్యుడు.. గొప్పనాయకుడు!: పైడికొండల మాణిక్యాలరావు

  • నేడు పీవీ నరసింహారావు జయంతి
  • నివాళులు అర్పించిన బీజేపీ నేత
  • దేశ ప్రజల హృదయాల్లో పీవీ సుస్థిరస్థానం సంపాదించుకున్నారని వ్యాఖ్య
భారత మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు అపర చాణక్యుడని బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు ప్రశంసించారు. ఈరోజు పీవీ జయంతి సందర్భంగా మాణిక్యాలరావు నివాళులు అర్పించారు. పీవీ నరసింహారావు గొప్ప దార్శనికుడనీ, సంస్కరణలకు ఆద్యుడని చెప్పారు.

దేశ భవిష్యత్తుకు పునాదులు వేసిన గొప్ప నాయకుడని ప్రశంసించారు. పీవీ నరసింహారావు దేశ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని వ్యాఖ్యానించారు. దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పైడికొండల ట్వీట్ చేశారు.
Andhra Pradesh
BJP
pydikondala manikyalarao
pv narasimha rao
birth anniversary
Congress

More Telugu News