Jagan: విజయనిర్మల ఇంట వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో... జగన్ ను స్వయంగా తీసుకెళ్లి చూపిన నరేశ్!

  • వైఎస్, కృష్ణ కుటుంబాల మధ్య సాన్నిహిత్యం
  • గతంలో కొంతకాలం కాంగ్రెస్ లో ఉన్న కృష్ణ
  • తన తండ్రి చిత్రపటాన్ని చూసి జగన్ భావోద్వేగం
ఈ ఉదయం విజయనిర్మల భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ వచ్చిన వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. తన తల్లికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎంతో అభిమానమని నటుడు నరేశ్, జగన్ కు వివరించారు. ఇంట్లోని ఓ టేబుల్ పై పూలమాలలు వేసివున్న వైఎస్ చిత్రపటాలను జగన్ కు చూపించారు. ఈ సమయంలో జగన్ సైతం ఒకింత భావోద్వేగానికి గురై, నరేశ్ ను కౌగిలించుకుని ఓదార్చారు.

కాగా, కృష్ణ కుటుంబానికి, వైఎస్ కుటుంబానికీ మంచి సాన్నిహిత్యం ఉండేదన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో వైఎస్ తో చాలా దగ్గరగా ఉండేవారు. ఆపై రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఆ కుటుంబంతో కృష్ణ ఫ్యామిలీ దగ్గరగానే ఉంటూ వచ్చింది.
Jagan
Krishna
Vijayanirmala
YS

More Telugu News