చంద్రబాబు నివాసానికి సీఆర్డీయే నోటీసులు... వారం రోజుల గడువు!
- ఈ ఉదయం నోటీసులు
- నిర్మాణాలకు అనుమతులు లేవు
- నదికి 100 మీటర్లలోపే నిర్మాణాలు
- వారంలో సమాధానం ఇవ్వాలని ఆదేశం
ఈ ఉదయం చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్న అధికారులు నోటీసులను లింగమనేని రమేశ్ పేరిట జారీ చేశారు. కరకట్టపై అక్రమంగా ఈ భవంతిని నిర్మించారని నోటీసుల్లో పేర్కొన్నారు. గెస్ట్ హౌస్ సహా స్విమ్మింగ్ పూల్, హెలీ ప్యాడ్ లకు అనుమతి లేదని ప్రస్తావించారు. కృష్ణానదికి 100 మీటర్ల లోపే నిర్మాణం ఉందని, దీనిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.