Bigg boss: టాలీవుడ్ బిగ్ బాస్ మొదలయ్యే తేదీ ఇదేనట!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు టెలివిజన్ లో అతిపెద్ద రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న 'బిగ్ బాస్' మూడవ సీజన్ జూలై 21 నుంచి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. బిగ్ బాస్ ఇప్పటికే రెండు సీజన్ లు పూర్తయింది. తొలి సీజన్ లో ఎన్టీఆర్, రెండో సీజన్ లో నాని హోస్ట్ గా వ్యవహరించగా, మూడో సీజన్ లో నాగార్జున హోస్ట్ గా ఉంటారని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. మొత్తం 16 మంది పోటీదారులు హౌస్ లో ఉంటారని తెలుస్తున్నా, వారు ఎవరన్న విషయం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.

తొలి రెండు భాగాలతో పోలిస్తే, మరింత వినోదాత్మకంగా తాజా సీజన్ ఉంటుందని నిర్వాహకులు అంటున్నారు. బిగ్ బాస్ సెట్ ఎక్కడ ఉందన్న విషయాన్ని సస్పెన్స్ లో ఉంచుతూ, కార్యక్రమంపై మరింత ఆసక్తిని పెంచుతున్నారు. ఇదిలావుండగా, ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్లు వీరేనంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ జాబితా చక్కర్లు కొడుతోంది. బిగ్ బాస్ ప్రారంభ తేదీపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సివుంది.
Go Back to Shorts
Bigg boss
Season 3
Tollywood
Nagarjuna

More Telugu News