Revanth Reddy: కేసీఆర్ సర్కారుపై హైకోర్టును ఆశ్రయించిన రేవంత్ రెడ్డి

  • తెలంగాణ సచివాలయం కూల్చివేత అడ్డుకోవాలంటూ పిటిషన్
  • ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ కేసీఆర్ సర్కారుపై మండిపాటు
  • రేవంత్ పిటిషన్ పై రేపు విచారణ జరపనున్న హైకోర్టు
తెలంగాణ సచివాలయం కూల్చివేసి నూతన భవనాలు నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.400 కోట్లతో అత్యాధునిక స్థాయిలో సరికొత్త సచివాలయం నిర్మించాలని కేసీఆర్ తలపోస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ సచివాలయం భవనాలను కూల్చివేయకుండా అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ పిటిషన్ ను స్వీకరించిన న్యాయస్థానం రేపు విచారణ జరపనుంది.
Revanth Reddy
KCR
Telangana

More Telugu News