swaroopanandendra: నేనంటే ప్రాణం ఇచ్చే మోహన్ బాబు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషకరం: స్వరూపానందేంద్ర సరస్వతి

  • ఫిలింనగర్ దైవ సన్నిధానాన్ని సందర్శించిన స్వరూపానందేంద్ర
  • కార్యక్రమానికి హాజరైన పలువురు సినీ ప్రముఖులు
  • ధర్మ ప్రతిష్టాపన కోసం 21 ఏళ్లుగా పీఠం పని చేస్తోందన్న స్వామి
హైదరాబాదు ఫిలింనగర్ లో ఉన్న దైవ సన్నిధానాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి సందర్శించారు. పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు మోహన్ బాబు, టి.సుబ్బరామిరెడ్డి, శ్రీమతి సురేఖ, శ్రీకాంత్, మంచు విష్ణు, మంచు లక్ష్మి, పరుచూరి బ్రదర్స్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, భారతదేశం గర్వించదగ్గ మహోన్నత స్వామి స్వరూపానందేంద్ర అని కొనియాడారు. తాను, రజనీకాంత్ ఒకసారి వారి పీఠానికి వెళ్లి దర్శనం చేసుకున్నామని చెప్పారు. ప్రశాంతతను కోరుకునేవారు ఒకసారి శారదా పీఠాన్ని దర్శించుకోవాలని సూచించారు. స్వామివారి ఆశీస్సులు ఫిలింనగర్ దైవ సన్నిధానానికి ఎప్పుడూ ఉంటాయని చెప్పారు.

స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ, సినిమా వారు ముఖ్యంగా తానంటే ప్రాణం ఇచ్చే మోహన్ బాబు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. 21 ఏళ్లుగా ధర్మ ప్రతిష్టాపన కోసం శారదా పీఠం పని చేస్తోందని చెప్పారు. తమ పీఠానికి సుబ్బరామిరెడ్డి ఎంతో చేయూతనిచ్చారని... తాను లేకుండా ఆయన ఏ కార్యక్రమం చేయడానికి ఇష్టపడరని అన్నారు.
swaroopanandendra
mohan babu
subbiramireddy
tollywood

More Telugu News