kcr: కేసీఆర్ తో భేటీ అయ్యేందుకు హైదరాబాద్ చేరుకున్న జగన్

  • గన్నవరం నుంచి బేగంపేట విమానాశ్రయం చేరుకున్న జగన్
  • నేరుగా లోటస్ పాండ్ లోని నివాసానికి పయనం
  • రేపు, ఎల్లుండి కేసీఆర్ తో చర్చలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఆయన హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా లోటస్ పాండ్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య పలు వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ వివాదాల పరిష్కారం దిశగా చర్చలు జరపాలని తెలంగాణ సీఎం కేసీఆర్, జగన్ లు నిర్ణయించారు. ఈ సమావేశం కోసం జగన్ హైదరాబాదుకు వచ్చారు. రేపు, ఎల్లుండి ఇరువురు ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ప్రగతి భవన్ వేదికగా వీరిరువురూ చర్చలు జరపనున్నారు.
kcr
jagan
TRS
ysrcp

More Telugu News