Harish Rao: బావా.. మళ్లీ కుదరదేమో.. మన పాత చాంబర్లు చూసుకుందామా?: హరీష్ తో కేటీఆర్

షార్ట్స్‌లో చూడండి
ఈ రోజు తెలంగాణ సచివాలయం, అసెంబ్లీలకు భూమి పూజ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.

'బావా.. మళ్లీ కుదరదేమో... మన పాత చాంబర్లను ఒకసారి చూసుకుందామా?' అని హరీష్ రావుతో కేటీఆర్ అన్నారు. ఈ వ్యాఖ్యలకు హరీష్ చిరునవ్వులు చిందించారు. అనంతరం కార్యకర్తలతో కలసి ఇద్దరూ సెల్ఫీలు దిగి వెళ్లిపోయారు. మరోవైపు, వీరిద్దరినీ మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకునే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 
Go Back to Shorts
Harish Rao
KTR
TRS

More Telugu News