Krishna: బోరున విలపిస్తున్న కృష్ణను ఓదార్చిన నమ్రత!

  • అర శతాబ్దంపాటు సాగిన ప్రయాణం
  • గుండెలవిసేలా కన్నీరు పెట్టుకున్న కృష్ణ
  • దగ్గర కూర్చుని ఓదార్చిన నమ్రత
దాదాపు 50 సంవత్సరాల పాటు తన జీవితంలో అన్నీ తానై నడిపించిన విజయనిర్మల ఇక లేదని, కనిపించబోదని తెలుసుకున్న తరువాత హీరో కృష్ణ గుండెలవిసేలా కన్నీరు పెట్టారు. ఆ సమయంలో ఆయన్ను ఓదార్చేందుకు ఎవరూ సాహసం చేయని క్షణాల్లో మహేశ్ బాబు భార్య నమ్రత, ఆయన పక్కన వెళ్లి కూర్చుని ఓదార్చారు. చేయి పట్టుకుని ఏడవ వద్దని చెప్పారు. కాగా, విజయనిర్మల గత రాత్రి ఒంటిగంట సమయంలో కన్నుమూయగా, తెల్లారేవరకూ విషయాన్ని కృష్ణకు ఎవరూ చెప్పలేదు. ఉదయం నిద్రలేచిన తరువాత ఇంట్లో హడావుడి చూసి, ఏమైందని అడిగినప్పుడే ఆయనకు విషయం చెప్పారని తెలుస్తోంది.
Krishna
Namrata
Vijayanirmala

More Telugu News