jagan: జగన్ మేనమామ థియేటర్లు వాగులో ఉన్నాయి: టీడీపీ నేత రాజేంద్రప్రసాద్

  • ప్రజల నుంచి చంద్రబాబును దూరం చేయడానికి ప్రజావేదికను కూల్చారు
  • జగన్ ఇల్లు కూడా అక్రమ నిర్మాణమే
  • కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు
ప్రజావేదికను కూల్చడం, టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి భద్రతను తొలగించడంపై ఆ పార్టీ నేత రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనకు టీడీపీ ప్రభుత్వం భద్రతను కల్పించిందని చెప్పారు. ప్రజల నుంచి చంద్రబాబును దూరం చేయడానికే ప్రజావేదికను కూల్చేశారని అన్నారు. చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు జగన్ పాల్పడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాదులో ఉన్న జగన్ ఇల్లు కూడా అక్రమ నిర్మాణమేనని చెప్పారు. కడప జిల్లాలోని వాగులో జగన్ మేనమామ సినిమా థియేటర్లు ఉన్నాయని విమర్శించారు.
jagan
rajendra prasad
ysrcp
Telugudesam

More Telugu News