sampath raj: ఆ సినిమాలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి: విలన్ సంపత్ రాజ్

  • 'చెన్నై 28'తో మంచి గుర్తింపు
  • 'సరోజ'తో పెరిగిన క్రేజ్ 
  • 'భరణి' నిలబెట్టేసిందన్న సంపత్ రాజ్
తెలుగు తెరపై విలన్ గా సంపత్ రాజ్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. లుక్స్ పరంగానే కాకుండా, డైలాగ్ డెలివరీ పరంగాను ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రీసెంట్ గా వచ్చిన 'ఓటర్'లోను విలన్ గా ఆయన తన మార్క్ చూపించారు.

తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "చెన్నైలో నేను .. వెంకట్ ప్రభు .. ఎస్.పి. చరణ్ తరచుగా కలుస్తుంటాము. అలా ఒకసారి కలిసినప్పుడు 'చెన్నై 28' కథను విన్నాము. ఎస్.పి. చరణ్ నిర్మాతగా ముందుకువచ్చాడు. దర్శకుడిగా వెంకట్ ప్రభు రంగంలోకి దిగాడు. అలా చేసిన 'చెన్నై 28' నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. వెంకట్ ప్రభు చేసిన 'సరోజ' కూడా నటుడిగా నన్ను మరోస్థాయికి తీసుకెళ్లింది. ఆ తరువాత విశాల్ తో చేసిన 'భరణి' కూడా మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. అలా తమిళంలో వచ్చిన క్రేజ్ తో తెలుగులో బిజీ అయ్యాను" అని చెప్పుకొచ్చారు. 
sampath raj

More Telugu News