viajaya nirmala: విజయనిర్మల మరణంపై చిరంజీవి స్పందన

  • విజయనిర్మల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది
  • ఆమె ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి
  • తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు
నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా సత్తా చాటి  చలనచిత్ర రంగంలో మహిళాసాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నలిచిన విజయనిర్మల మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుకుతెచ్చుకుంటున్నారు. విజయనిర్మల మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల సానుభూతిని తెలియజేశారు. ఆమె మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. విజయనిర్మల ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని తెలిపారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని చెప్పారు.
viajaya nirmala
chiranjeevi
tollywood

More Telugu News