vijayanirmala: విజయ నిర్మల మృతికి ఏపీ సీఎం జగన్ ప్రగాఢ సంతాపం

  • ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు 
  • గిన్నిస్ రికార్డులకెక్కిన గొప్ప దర్శకురాలు
  • విజయ నిర్మల అంత్యక్రియలు రేపు
ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల మృతికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా ఆమె గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కారని గుర్తు చేశారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

విజయ నిర్మల గత రాత్రి గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆమె పార్థివదేహాన్ని ఉదయం 11 గంటలకు నానక్‌రామ్‌గూడలోని  ఆమె స్వగృహానికి తీసుకొస్తారు. అభిమానుల సందర్శనార్థం నేడు అక్కడే ఉంచి రేపు ఉదయం ఫిలించాంబర్‌కు తరలిస్తారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు.
vijayanirmala
Tollywood
Jagan
krishna

More Telugu News