Chandrababu: అలాగని మీ చంద్రబాబునాయుడు చెవిలో చెప్పారా?: పంచుమర్తి అనురాధపై బీజేపీ నేత ఫైర్

  • టీడీపీ హయాంలో కుంభకోణాలు జరిగాయి: లక్ష్మీపతి 
  • అవగాహన లేకుండా మాట్లాడొద్దు
  • అందుకే, మిమ్మల్ని అధికార ప్రతినిధి పదవి నుంచి తీసేసింది: పంచుమర్తి
ఏపీ టీడీపీ నేత పంచుమర్తి అనురాధపై బీజేపీ అధికార ప్రతినిధి లక్ష్మీపతి రాజా మండిపడ్డారు. ‘ఏబీఎన్’ లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరి మధ్య మాటలయుద్ధం నడిచింది. అవగాహన లేకుండా మాట్లాడుతున్నందుకే బీజేపీ అధికార ప్రతినిధి పదవి నుంచి లక్ష్మీపతి రాజాను తొలగించారని అనురాధ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలతో మండిపడ్డ లక్ష్మీపతి రాజా, ‘ఎవరు తీసేశారు నన్ను? లక్ష్మీపతి రాజాను అధికార ప్రతినిధిగా తీసెయ్యలా. అలాగని మీ చంద్రబాబునాయుడు చెవిలో చెప్పాడా?’ అంటూ విమర్శించారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పలు కుంభకోణాలు జరిగాయని ఆరోపిస్తున్న లక్ష్మీపతి రాజా, వాటిని నిరూపించాల్సింది పోయి ఈ విధంగా మాట్లాడటం తగదంటూ అనురాధ విరుచుకుపడ్డారు.
Chandrababu
Telugudesam
panchumarthy
anuradha
bjp
Lakshmipati Raja
spokes person
Andhra Pradesh

More Telugu News