anagani satya prasad: బీజేపీ నేతలతో భేటీ అయిన టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రసాద్

  • సత్యప్రసాద్ ను తీసుకెళ్లిన ఎంపీ గరికపాటి రామ్మోహన్
  • రేపల్లె నుంచి రెండో సారి గెలుపొందిన సత్యప్రసాద్
  • మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వెళ్లినట్టు సమాచారం
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు టీడీపీ విలవిల్లాడుతోంది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు జంప్ అయిపోయారు. మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ కాషాయ కండువా కప్పుకున్నారు. ఎంతో మంది టీడీపీ నేతలు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, గుంటూరు జిల్లా రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఢిల్లీలో బీజేపీ నేతలతో భేటీ అయ్యారనే వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని సమాచారం. బీజేపీలో చేరిన ఎంపీ గరికపాటి రామ్మోహన్ వీరిని బీజేపీ నేతల వద్దకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. రేపల్లె నియోజకవర్గం నుంచి సత్యప్రసాద్ వరుసగా రెండో సారి గెలుపొందారు.
anagani satya prasad
Telugudesam
bjp
garikapati

More Telugu News