Pakistan: టాస్ గెలిచిన న్యూజిలాండ్... ఆరంభంలోనే తడబాటు

  • వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యం
  • బ్యాటింగ్ తీసుకున్న కివీస్
  • విజృంభించిన పాక్ పేసర్లు
పాకిస్థాన్ తో వరల్డ్ కప్ పోరులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, తేమ పరిస్థితుల్లో బర్మింగ్ హామ్ పిచ్ ను సద్వినియోగం చేసుకున్న పాక్ పేసర్లు కివీస్ టాపార్డర్ ను దెబ్బతీశారు. వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 38 పరుగులకే 3 కీలక వికెట్లు చేజార్చుకుంది. గప్టిల్ (5), మన్రో (12), రాస్ టేలర్  (3) నిరాశపరిచారు. పాక్ బౌలర్లలో అమీర్ ఓ వికెట్, షహీన్ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం కివీస్ 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ విలియమ్సన్ (21)కు తోడు టామ్ లాథమ్ (1) ఆడుతున్నాడు.
Pakistan
New Zealand
Cricket
World Cup

More Telugu News